రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు బీజేవైయం ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సహకారంతో మేడ్చల్ జిల్లా ఆల్విన్ కాలనీ డివిజన్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి నరేష్, భాజపా జిల్లా నాయకులతో కలిసి ప్రారంభించారు. తలసేమియా రోగుల కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు భాజపా నాయకులు తెలిపారు.
ఆల్విన్ కాలనీ డివిజన్లో రక్తదాన శిబిరం - bandi sanjay
మేడ్చల్ జిల్లా ఆల్విన్ కాలనీ డివిజన్లో బీజేవైయం నాయకులు లయన్స్ క్లబ్ సహకారంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. తలసేమియా రోగుల కోసం ఈ శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఆల్విన్ కాలనీ డివిజన్లో రక్తదాన శిబిరం
కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి ప్రజలంతా భౌతిక దూరాన్ని పాటించాలని కోరారు. లాక్డౌన్ వల్ల తలసేమియా వ్యాధిగ్రస్తులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇందుకోసం రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు యువమోర్చా నాయకులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ శిబిరంలో దాదాపు 105 రక్తదానం చేశారని వెల్లడించారు.
ఇవీ చూడండి: ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. కదిలొచ్చిన యంత్రాంగం