వినాయక నిమజ్జనం కోసం అధికారులు ఏర్పాట్లు చేయకపోవడంపై భాజపా ఎమ్మెల్సీ రామచందర్రావు మండిపడ్డారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సఫిల్గూడాలోని చెరువును పరిశీలించారు. నిమజ్జనం కోసం కనీస ఏర్పాట్లు చేయలేదని ఆరోపించారు.
'వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు చేయకపోవడం బాధాకరం' - మేడ్చల్ జిల్లాలో పర్యటించిన ఎమ్మెల్సీ రామచందర్ రావు
హిందువుల పండుగపై రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని భాజపా ఎమ్మెల్సీ రామచందర్ రావు ఆరోపించారు. మేడ్చల్ జిల్లా సఫిల్గూడాలోని వినాయక నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన చెరువును పరిశీలించారు.
'వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు చేయకపోవడం బాధాకరం'
హిందువుల పండుగ పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోందని... వినాయక మండపాల నిర్వాహకులపై కేసులు పెట్టడం దారుణమని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.