జీహెచ్ఎంసీ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్ది పలు పార్టీల నేతలు ప్రచార జోరు పెంచారు. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేపట్టిన అభివృద్ధే తప్ప.. తెరాస ఎలాంటి అభివృద్ధి చేయలేదని రామంతాపూర్ డివిజన్ భాజపా అభ్యర్థి బండారు శ్రీవాణి వెంకట్రావు అన్నారు.
తెరాస ఎటువంటి అభివృద్ధి చేయలేదు: బండారు శ్రీవాణి - తెరాస అభివృద్ధి చేయలేదన్న భాజపా
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పలు పార్టీల అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. నువ్వా నేనా అన్నట్లుగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రామంతపూర్ డివిజన్ భాజపా అభ్యర్థి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. గతంలో గెలిచిన తెరాస ఎటువంటి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు.
'తెరాస ఎటువంటి అభివృద్ధి చేయలేదు'
తనకు ఓటు వేసి గెలిస్తే మరింత అభివృద్ధి చేస్తానని... డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి :కమీషన్ల కోసం కొత్త సచివాలయం: బండి
Last Updated : Nov 27, 2020, 12:34 PM IST