భాజపాని గెలిపిస్తే మచ్చ బొల్లారం డివిజన్లో సమస్యలు పరిష్కరించి అభివృద్ధి చేస్తానని భాజపా అభ్యర్థి సర్వ నరేష్ హామీ ఇచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా మధుర నగర్, ప్రేమ్ నగర్ ప్రాంతాల్లో భాజపా నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తెరాస పార్టీకి ప్రత్యామ్నాయంగా భాజపా దూసుకెళ్తోందని అన్నారు.
తెరాసకి ప్రత్యామ్నాయం భాజపానే: బొల్లారం అభ్యర్థి నరేష్ - మచ్చ బొల్లారం డివిజన్లో తెరాస ప్రచారం
గ్రేటర్ ఎన్నికల్లో భాజపాని గెలిపిస్తే మచ్చ బొల్లారం డివిజన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని భాజపా అభ్యర్థి సర్వ నరేష్ హామీ ఇచ్చారు. ఎన్నికల దృష్ట్యా డివిజన్లోని మధుర నగర్, ప్రేమ్ నగర్ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. వరద బాధితులకు నష్ట పరిహారం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
తెరాసకి ప్రత్యామ్నాయం భాజపానే: బొల్లారం అభ్యర్థి నరేష్
డివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయని రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నరేష్ పేర్కొన్నారు. వరద బాధితులకు పూర్తి స్థాయిలో ఆర్థిక సహాయం అందించడంలో తెరాస పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. భాజాపా అభ్యర్థిగా తనను గెలిపిస్తే అభివృద్ధి పథంలో డివిజన్ని తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.