మేడ్చల్ జిల్లా నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ స్థలాలు పార్కులు, చెరువుల స్థలాలను కాపాడడంలో ప్రభుత్వ అధికారులు విఫలమయ్యారంటూ... నిజాంపేట మున్సిపల్ కార్యాలయం ముందు భాజపా నాయకులు ధర్నా నిర్వహించారు. మల్లన్నగుడి స్థలంలో తప్పుడు సర్వే నంబర్ జరుగుతున్న ఆక్రమణలను వెంటనే తొలగించాలని నినాదాలు చేశారు. ఆక్రమణలను తొలగించని యడల ప్రభుత్వ స్థలాల రక్షణపై హైకోర్టుకు వెళ్తామని పేర్కొన్నారు. పలు పార్టీల నాయకులు తెరాసలో చేరి మున్సిపాలిటీ పరిధిలోని స్థలాలను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. వెంటనే ఆక్రమణల విషయంపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని భాజపా నాయకులు హెచ్చరించారు.
'ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి' - BJP ACTIVISTS PROTEST AT NIZAMPET
నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ స్థలాలను కొంతమంది ఆక్రమించుకుంటున్నారని... భాజపా నాయకులు ఆరోపించారు. నిజాంపేట మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
'ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి'
Last Updated : Nov 18, 2019, 5:09 PM IST