మేడ్చల్ జిల్లా కొంపల్లి బిగ్ బజార్లో నాణ్యత లేని కూరగాయలు అమ్ముతున్నారంటూ ఓ వినియోగదారుడు కొంపల్లి పురపాలికలో ఫిర్యాదు చేశాడు. పురుగులు పట్టిన తిను బండరాలను విక్రయిస్తున్నారని వాట్సాప్ ద్వారా మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. వినియోగదారుడి నుంచి వచ్చిన ఫిర్యాదుతో... స్పందించిన మున్సిపల్ అధికారులు బిగ్ బజార్లో తనిఖీలు నిర్వహించారు. బిగ్ బజార్లో కుళ్లిపోయిన కూరగాయలతో పాటు పురుగులు పట్టిన వస్తువులను స్వాధీనం చేసుకుని జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్కు సమాచారం అందించారు.
ఇకపై అలా జరిగితే వాట్సాప్ చేసినా చాలు...