తెలంగాణ

telangana

ETV Bharat / state

'కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూరేలా ప్రధాని మోదీ పాలన' - తెలంగాణ వార్తలు

సాగు చట్టాలను నిరసిస్తూ చేపట్టిన భారత్ బంద్ మేడ్చల్‌ జిల్లాలో కొనసాగుతోంది. ఈ ధర్నాలో సీపీఐ కార్యకర్తలు పాల్గొన్నారు. 150 రోజుల నుంచి రైతులు ఆందోళనలు చేస్తున్నా.. కేంద్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

bharat bandh in medchal, medchal district
మేడ్చల్‌లో భారత్ బంద్, మేడ్చల్ జిల్లా తాజా వార్తలు

By

Published : Mar 26, 2021, 1:12 PM IST

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన భారత్ బంద్ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో కొనసాగుతోంది. కాప్రా సర్కిల్, ఈసీఐఎల్ చౌరస్తాలో సీపీఐ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఆ చట్టాలను రద్దు చేయాలని 150 రోజుల నుంచి రైతులు ధర్నా చేస్తున్నా పట్టించుకోవడం లేదని వామపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూరేలా ప్రధాని మోదీ పాలన ఉందని ఆరోపించారు. అనంతరం ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి.. స్టేషన్‌కి తరలించారు.

ఇదీ చదవండి:'సాగు కూలీలకూ రైతు బీమా వర్తింపుపై నిర్ణయం తీసుకుంటాం'

ABOUT THE AUTHOR

...view details