తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రతిఒక్కరూ బతుకమ్మ సంబురాన్ని ఘనంగా జరుపుకోవాలి' - బతుకమ్మ చీరల పంపిణీ వార్తలు

ప్రతి మహిళ బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ప్రభుత్వం ప్రతి ఏడాది బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా పోచారం, ఘట్​కేసర్​ మున్సిపాలిటీల్లో మహిళలకు ఆయన బతుకమ్మ చీరలను అందజేశారు.

batukamma saree distribution at ghatkesar and pocharam by minister mallareddy
బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి

By

Published : Oct 10, 2020, 11:57 AM IST

తెలంగాణలో పేదింటి ఆడబిడ్డ సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా పోచారం, ఘట్​కేసర్​ మున్సిపాలిటీ పరిధిలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మంత్రితో పాటు మున్సిపల్​ ఛైర్మన్​లు కొండల్​రెడ్డి, పావనీ పాల్గొన్నారు.

దసర నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు నిర్వహించే బతుకమ్మ వేడుకలను కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అన్ని వర్గాల వారికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని.. వాటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఇవీ చూడండి: సమ్మక్క-సారలమ్మలకు బతుకమ్మ చీరలు సమర్పించిన మంత్రి సత్యవతి

ABOUT THE AUTHOR

...view details