మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రామాంతపూర్ డివిజన్ శారదానగర్ కాలనీలో కొత్తగా బస్తీ దవాఖానాను ఏర్పాటు చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి కలిసి దవాఖానాను ప్రారంభించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ సంఘం సభ్యురాలు, కార్పొరేటర్ గంధం జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.
శారదానగర్ కాలనీలో బస్తీ దవాఖానాను ప్రారంభించిన కలెక్టర్ - basthi dawakhana started by collector at medhal district
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రామాంతపూర్ డివిజన్ శారదానగర్ కాలనీలో బస్తీ దవాఖానాను జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి కలిసి దవాఖానాను ప్రారంభించారు. రాబోయే రోజుల్లో జిల్లాలో మరిన్ని ఏర్పాటు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
శారదానగర్ కాలనీలో బస్తీ దవాఖానాను ప్రారంభించిన కలెక్టర్
బస్తీ దవాఖానా ద్వారా పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు చెప్పారు. ఒక్కో బస్తీ దవాఖానాలో ఒక వైద్యుడు, నర్సు, సహాయకుడు ఉంటారని తెలిపారు. రాబోయే రోజుల్లో జిల్లాలో మరిన్ని దవాఖానాలు ఏర్పాటు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:'ఐదు నెలల్లో కేరళ విమాన ప్రమాదంపై నివేదిక'