పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకే ప్రభుత్వం.. హైదరాబాద్‌లో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తోందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కూకట్పల్లి కేపీహెచ్‌బీ కాలనీ మూడో ఫేసులో ఎమ్మెల్సీ నవీన్ కుమార్, కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావుతో కలిసి బస్తీ దవాఖానాను మంత్రి ప్రారంభించారు.
'ప్రతి ఒక్కరికీ వైద్యం అందించేందుకే బస్తీ దవాఖానాలు' - కూకట్పల్లి బస్తీ దవాఖానా
పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకే బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కూకట్పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో బస్తీ దవాఖానాను ఆయన ప్రారంభించారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 350 ఆస్పత్రులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
'ప్రతి ఒక్కరికీ వైద్యం అందించేందుకే బస్తీ దవాఖానలు'
జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 350 ఆస్పత్రులు ప్రారంభించనున్నట్లు మల్లారెడ్డి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్, ఆరోగ్యశ్రీ అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే చెందుతుందని వెల్లడించారు.
ఇదీ చదవండి:శరవేగంగా యాదాద్రి ఆలయ పునఃనిర్మాణ పనులు