మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి ప్రధాన రహదారి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతింది. గుంతలమయంగా తయారైన ఈ రోడ్డు ప్రమాదకరంగా మారి వాహనదారులకు నరకం చూపిస్తోంది. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే వివేకానందకు కూడా ఈ ఇబ్బందులు తప్పలేదు.
బాచుపల్లి రోడ్డుపై ప్రయాణికుల పాట్లు.. పట్టించుకోని అధికారులు - mechal district latest news
మేడ్చల్ జిల్లాలోని బాచుపల్లి ప్రధాన రహదారి వాహనదారులకు నరకం చూపిస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న రోడ్డుకు అధికారులు మరమ్మతులు చేయకపోవడంతో ప్రయాణికులకు పాట్లు తప్పడం లేదు.

భారీ వర్షాలకు దెబ్బతిన్న బాచుపల్లి రోడ్డు
బాచుపల్లి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి ఇదే ప్రధాన రహదారి కావడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడంలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చదవండి:CP Anjani kumar: జోకర్ మాల్‌వేర్ ఓపెన్ చేస్తే అంతే సంగతులు