మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా తుకారాంగేట్ పీఎస్ పరిధిలో ఇత్తడని పుత్తడిగా నమ్మించి ఓ జంట రూ. 65 వేల నగదును ఎత్తుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక రియో పాయింట్ హోటల్ సమీపంలో ఉన్న గాయత్రి జువెలర్స్‌కు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వెళ్లారు. అత్యవసరంగా డబ్బు అవసరముందని మూడు తులాల నకిలీ నెక్లెస్‌ను తాకట్టు పెట్టి రూ. 65 వేల నగదును తీసుకెళ్లారు.
ఇత్తడిని పుత్తడిగా నమ్మించి.. డబ్బులు కొట్టేశారు - Attention Diversion and robbed money at Tukaramgate medchal
ఇత్తడిని పుత్తడిగా నమ్మించి పాన్ బ్రోకర్స్ నుంచి ఓ జంట రూ. 65 వేల నగదును దోచుకెళ్లింది. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా తుకారాంగేట్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది.
ఇత్తడిని పుత్తడిగా నమ్మించి.. డబ్బులు కొట్టేశారు
మర్నాడు ఉదయం దుకాణం యజమాని.. అది నకిలీదని గుర్తించి వారిచ్చిన చిరునామాలో వాకబు చేశారు. అక్కడ అలాంటి వారు ఎవరూ లేరని స్థానికులు తెలపగా... తాను మోసపోయినట్లు యజమాని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ టీవీ ఫుటేజీలో నిందితులను గుర్తించి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ ఎల్లప్ప తెలిపారు.
ఇదీ చూడండి: 'కరోనాపై యుద్ధం కోసం.. వచ్చే ఆదివారం జనతా కర్ఫ్యూ'