హైదరాబాద్ శివారు జీడిమెట్ల ఫాక్స్ సాగర్ చెరువు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటీవల నగరంలో కురిసిన వర్షాలకు చెరువు నుంచి కాలనీల్లోకి భారీగా నీరు వస్తోంది. ఈ క్రమంలో అలుగు పూడ్చేందుకు యత్నించిన మహిళలను పోలీసులు అడ్డుకోవడంతో... స్థానికులకు ఆందోళన చేపట్టారు.
జీడిమెట్ల ఫాక్స్‌సాగర్ చెరువు వద్ద ఉద్రిక్తత - ఫాక్స్ సాగర్ వార్తలు
కాలనీల్లోకి నీరు వస్తోందని అలుగు పూడ్చేందుకు యత్నించిన మహిళలను పోలీసులు అడ్డుకున్న ఘటన జీడిమెట్లలోని ఫాక్స్‌సాగర్ వద్ద చోటు చేసుకుంది. ఈ క్రమంలో పోలీసులతో మహిళలు వాగ్వాదానికి దిగారు.

జీడిమెట్ల ఫాక్స్‌సాగర్ చెరువు వద్ద ఉద్రిక్తత
20 రోజుల క్రితం చెరువు నిండుకుండలా మారడంతో.. సుభాష్‌నగర్, గంపలబస్తీ గుండా నీరు నాలాలోకి వెళ్లేందుకు కాలువ తీశారు. ఇప్పటికీ అలుగు పూడ్చకపోవడంతో.. గత మూడు వారాలుగా ఇంటి ముందు నీళ్లు ప్రవహిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు ఎవరూ స్పందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జీడిమెట్ల ఫాక్స్‌సాగర్ చెరువు వద్ద ఉద్రిక్తత
ఇదీ చూడండి:వరద ముంపు ప్రాంతాల్లో ఆరోగ్య సమస్యలు..