తెలంగాణ

telangana

ETV Bharat / state

అవినీతి తిమింగళం... అనిశా వలలో జిల్లా పంచాయతీ అధికారి - అనిశా వలలో చిక్కిన పంచాయతీ అధికారి

లంచాలకు అలవాటుపడిన ఓ జిల్లా పంచాయతీ అధికారి ఏసీబీ వలకు చిక్కాడు. ఓ వ్యక్తి నుంచి డబ్బులు తీసుకుంటూ... ఏసీబీ వలకు చిక్కాడు.

అనిశా వలలో చిక్కిన పంచాయతీ అధికారి

By

Published : Nov 7, 2019, 10:40 PM IST

అనిశా వలలో చిక్కిన పంచాయతీ అధికారి

మేడ్చల్​-మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లి గ్రామ మాజీ సర్పంచ్​ భేరి ఈశ్వర్​ ఆడిట్​ రిపోర్ట్​ క్లియర్ చేయడానికి మేడ్చల్​ జిల్లా పంచాయతీ అధికారి రూ. 5 లక్షలు డిమాండ్​ చేశాడు. దీంతో బాధితుడు అనిశా అధికారులను ఆశ్రయించాడు. అధికారులు ఈరోజు ఈశ్వర్​తో రూ. లక్ష పంపించారు. కీసరలోని కలెక్టర్​ కార్యాలయ ప్రాంగణంలోని జిల్లా పంచాయతీ కార్యాలయంలోని డీపీఓ రవికుమార్​ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. అనంతరం కొంపల్లిలోని అతని ఇంట్లో సోదాలు నిర్వహించగా... గతంలో రవికుమార్​ లంచాలు తీసుకున్న వీడియోలు బయటపడ్డాయి. దీంతో రవికుమార్​ ఇంటితోపాటు అతని బంధువుల ఇళ్లలోనూ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details