విప్లవ ఉద్యమం పట్ల ఆకర్షితులై నిస్వార్ధంగా తమ జీవితాలను పణంగా పెట్టిన అమరులకు నివాళులు అర్పించారు. శ్రీకాకుళం సాయుధ రైతాంగ పోరాటానికి 50 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా అల్వాల్ సుభాష్‌నగర్‌లోని అమరవీరుల స్థూపంవద్ద, అమరుల బంధుమిత్రుల సంఘం ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. అమరులను స్మరించుకుంటూ, వారి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు. పీడిత ప్రజల విముక్తి కోసం ఉద్యమ బాట పట్టిన వారిపై అక్రమ కేసులు పెట్టడం, భూటకపు ఎన్‌కౌంటర్లలలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని వక్తలు అన్నారు. గత ఏడాది వరవరరావు ఇక్కడికి వచ్చారని, ఇప్పుడు పోలీసులు ఆయనను నిర్బంధంలో ఉంచారని తెలిపారు.
అమరుల సంస్మరణ ర్యాలీ..! - మేడ్చల్ జిల్లా
మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ అమరులైన ఉద్యమకారులకు వారి కుటుంబాలు, స్నేహితులు ఘనంగా నివాళులు అర్పించారు. అమరులను స్మరించుకుంటూ, వారి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు.
అమరుల సంస్మరణ ర్యాలీ
కుటుంబాలను, పిల్లలను వదిలి విప్లవం పట్ల ఆసక్తితో ఎంతో మంది అమరులైన ఆదర్శవంతులందరికీ జోహార్లు తెలియజేశారు. ప్రజా గాయకుడు డప్పు రమేష్ అమరుల స్మృతి గీతాలు ఆలపించారు. వారి సేవలను గుర్తు చేస్తూ పాడిన పాటలు అక్కడివారిని కన్నీరు పెట్టించాయి. ఈ కార్యక్రమంలో నర్సన్న, కోదండరావు, ఉష, పద్మకుమారి, పలువురు అమరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : చాక్లెట్ చూపి.. బంగారం దోచే మహిళాదొంగ అరెస్ట్