మహాశివరాత్రికి మేడ్చల్ జిల్లా కీసర గుట్టలోని శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం సిద్ధమైంది. ఆ రోజున లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున.. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు మంచినీరు, చలువ పందిళ్లు, వాహనాలకు పార్కింగ్ పనులు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
మహాశివరాత్రికి సిద్ధమైన కీసరగుట్ట - KEESARA GUTTA Temple
ప్రముఖ కీసరగుట్ట ఆలయంలో శివనామస్మరణ మారుమోగుతోంది. ఈ నెల 21న శివరాత్రి పండుగను పురస్కరించుకుని అధికారులు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెద్ద సంఖ్యలో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు మేడ్చల్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.
మహాశివరాత్రికి సిద్ధమైన కీసరగుట్ట
స్వామి వారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో రానున్న నేపథ్యంలో భారీకేడ్లను ఏర్పాటు చేశారు. ప్రముఖులను ప్రత్యేక క్యూలైన్స్ ద్వారా అనుమతిస్తారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెద్ద సంఖ్యలో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయనునట్లు ఆయన పేర్కొన్నారు.
ఇవీ చూడండి:రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్ల బదిలీ