మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నేత కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్లార్) ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఏఐసీసీ సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ పంపారు.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే - కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఏఐసీసీ సభ్యుడు కె.లక్ష్మారెడ్డి
మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నియమించిన కొద్దిసేపటికే ఆ పార్టీ సీనియర్ నేత, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఏఐసీసీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీలో సీనియర్ నాయకులకు తగిన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు.

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఏఐసీసీ సభ్యుడు కె.లక్ష్మారెడ్డి
ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఏఐసీసీ సభ్యునిగా కొనసాగలేనని కేఎల్లార్ లేఖలో పేర్కొన్నారు. పార్టీలో సీనియర్లకు తగిన గుర్తింపు లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో తనకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడిగా మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిని ప్రకటిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్న కొద్దిసేపటికే లక్ష్మారెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం గమనార్హం.
ఇదీ చదవండి:TPCC: రేవంత్ హస్తానికి పగ్గాలు... పార్టీలో కొత్త ఆశలు