తెలంగాణ

telangana

ETV Bharat / state

'స్క్రీనింగ్ పరీక్ష తర్వాతే ఆర్టీఏ ఆఫీసులోనికి అనుమతి' - మాస్కు లేకపోతే లోనికి అనుమతి లేదు

కరోనా వ్యాప్తి నేపథ్యంలో భౌతిక దూరం పాటించేలా అన్ని కార్యాలయాల్లో సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్​టీఏ కార్యకలాపాలకు అనుమతి ఇవ్వడం వల్ల మేడ్చల్ జిల్లా పేట్ బషీర్​బాద్​లో స్క్రీనింగ్ తర్వాతే లోనికి అనుమతిస్తున్నారు.

'స్ర్కీనింగ్ పరీక్ష తర్వాతే ఆర్టీఏ ఆఫీసులోనికి అనుమతి'
'స్ర్కీనింగ్ పరీక్ష తర్వాతే ఆర్టీఏ ఆఫీసులోనికి అనుమతి'

By

Published : May 8, 2020, 3:35 PM IST

మేడ్చల్ జిల్లా పేట్ బషీర్​బాద్ ఆర్టీఏ కార్యాలయంలో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించిన అనంతరమే కార్యాలయం లోనికి అనుమతిస్తున్నారు. జిల్లా రవాణా అధికారి కిషన్ ఆదేశాల మేరకు ఆఫీసుకు వచ్చే ప్రజలు, కార్యాలయ సిబ్బందికి స్క్రీనింగ్ చేసిన తర్వాతే లోనికి అనుమతించాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రతి కౌంటర్ వద్ద రెండు మీటర్ల దూరం పాటించేలా గుర్తులు ఏర్పాటు చేశారు. మాస్కు లేకపోతే లోనికి అనుమతిలేదంటూ బోర్డులు ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details