కుటుంబ కలహాలతో ఆదిత్య ఆసుపత్రి ఎండీ రవీందర్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యభర్తల మధ్య ఘర్షణ జరిగిన తర్వాత ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. ఎటువంటి ఆర్థిక సమస్యలు లేవని, ఓ చిన్న ఫంక్షన్ గురించి ఇద్దరి మధ్య గొడవ జరిగినట్టు పోలీసులు తెలిపారు.
తుపాకీతో కాల్చుకొని ఆసుపత్రి ఎండీ ఆత్మహత్య - ఆసుపత్రి ఎండీ రవీందర్ కుమార్ ఆత్మహత్య
మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌లోని ఆదిత్య ఆసుపత్రి ఎండీ రవీందర్ కుమార్ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిన్న ఫంక్షన్ విషయంలో భార్యతో గొడవ పడి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
తుపాకీతో కాల్చుకొని ఆసుపత్రి ఎండీ ఆత్మహత్య
రాత్రి ఓ స్నేహితుడితో భార్యను అత్తారింటికి పంపించి, అర్థరాత్రి కొడుకుతో ఫోన్లో మాట్లాడిన అనంతరం తన లైసెన్స్డ్ గన్‌తో కాల్చుకున్నాడని వివరించారు.
ఇదీ చూడండి:దలాల్ స్ట్రీట్ ఢమాల్- సెన్సెక్స్ రికార్డు పతనం