అనిశాకు చిక్కిన అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి
15:58 December 23
అనిశాకు చిక్కిన అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి
మేడ్చల్ జిల్లా దుండిగల్ ఎమ్మార్వో కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రూ.40 వేలు లంచం తీసుకుంటూ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి నరేందర్ రెడ్డి అనిశాకు చిక్కాడు. బహదూర్ పల్లిలోని 248 సర్వేనెంబర్లో 30 గుంటల స్థలాన్ని ఆన్లైన్ చేసేందుకు నరేందర్ రెడ్డి... శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి దగ్గర రూ.40 వేలు లంచం డిమాండ్ చేశాడు. శ్రావణ్ కుమార్ ఏసీబీ అధికారులను ఆశ్రయించడం వల్ల ఇవాళ నేరుగా నరేందర్ రెడ్డి నలబై వేల రూపాయలు తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు.
రేపు ఏసీబీ కోర్టులో నిందితుడిని హాజరు పరచి... అనంతరం చంచల్ గూడ జైలుకు తరలిస్తామని ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. ఈఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు.
ఇదీ చూడండి : మిర్చి రైతులకు ఓ వైపు ఆనందం.. మరోవైపు ఆవేదన..