తొలి రోజు అనిశా విచారణలో నోరువిప్పని కీసర కేసు నిందితులు..! - keesara case second day investigation
![తొలి రోజు అనిశా విచారణలో నోరువిప్పని కీసర కేసు నిందితులు..! keesara case update](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8560894-743-8560894-1598424554665.jpg)
11:47 August 26
తొలి రోజు అనిశా విచారణలో నోరువిప్పని కీసర కేసు నిందితులు..!
కీసర తహసీల్దార్ నాగరాజు లంచం కేసులో రెండో రోజు అనిశా విచారణ కొనసాగుతోంది. నాంపల్లిలోని అనిశా కార్యాలయంలో నిందితులు తహసీల్దార్ నాగరాజు, వీఆర్ఏ సాయిరాజ్, స్థిరాస్తి వ్యాపారులు అంజిరెడ్డి, శ్రీనాథ్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
నలుగురు నిందితులను వేర్వేరు గదుల్లో ఉంచి ప్రశ్నిస్తున్నారు. మొదటి రోజు పలు ప్రశ్నలకు నిందితులు నోరు విప్పనట్లు సమాచారం. వారి నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు అనిశా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇవీచూడండి: రూ.1.10 కోట్లు లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన కీసర తహసీల్దార్