తెలంగాణ

telangana

ETV Bharat / state

సాయంత్రం అనిశా ప్రత్యేక జడ్జి ఎదుట కీసర ఘటన నిందితులు - అనిశా వలలో భారీ తిమింగలం వార్తలు

రూ.1.10 కోట్ల లంచం తీసుకుంటూ రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడిన మేడ్చల్​ జిల్లా కీసర తహసీల్దార్​ కేసులో ఏసీబీ అధికారులు విచారణ వేగవంతం చేశారు. ప్రధాన నిందితుడు నాగరాజుతో పాటు రియల్టర్లు శ్రీనాథ్‌, అంజిరెడ్డి, వీఆర్​ఏలను అనిశా కార్యాలయానికి తరలించారు. సాయంత్రం వీరిని అనిశా ప్రత్యేక జడ్జి ఎదుట ప్రవేశపెట్టనున్నారు.

ACB officials investigating Keesara mro nagaraju
కీసర తహసీల్దార్​ కేసులో విచారణ వేగవంతం..

By

Published : Aug 15, 2020, 9:19 AM IST

Updated : Aug 15, 2020, 12:45 PM IST

మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లిదాయరలో 53 ఎకరాల భూ వ్యవహారంలో పెద్దమొత్తంలో లంచం తీసుకుంటూ పట్టుబడిన తహసీల్దార్ నాగరాజు కేసులో ఏసీబీ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. ప్రధాన నిందితుడు సహా రియల్టర్లు శ్రీనాథ్​, అంజిరెడ్డి, రాంపల్లి గ్రామ వీఆర్​ఏ సాయిరాజ్​లను కార్యాలయానికి తరలించారు. నాంపల్లిలోని అవినీతి నిరోధక శాఖ ప్రధాన కార్యాలయంలో విచారణ కొనసాగిస్తున్నారు.

నాగరాజు గతంలోనూ భూదందాలకు సంబంధించిన వ్యవహారాలు పరిష్కరించేందుకు డబ్బు డిమాండ్ చేశాడా..? ఫిర్యాదు చేసేందుకు బయటకు రాని బాధితులెవరైనా ఉన్నారా..? తహసీల్దార్‌తో పాటు దళారుల వెనక ఎవరున్నారనే కోణంలో అధికారులు విచారిస్తున్నారు.

మరోవైపు అల్వాల్​లోని నాగరాజు నివాసంలో, కీసరలోని తహసీల్దార్‌ కార్యాలయంలో అనిశా సోదాలు కొనసాగుతున్నాయి. ఇంట్లో మరో రూ.28 లక్షలు, బంగారం, ఆస్తుల పత్రాలు, కార్యాలయంలో భూవివాదానికి సంబంధించి దస్త్రాలు, కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

తహసీల్దార్​ నాగరాజుతో పాటు మరో ముగ్గురు నిందితులను సాయంత్రం అనిశా ప్రత్యేక జడ్జి ఎదుట ప్రవేశపెట్టనున్నారు.

కీసర తహసీల్దార్​ కేసులో విచారణ వేగవంతం..

ఇదీచూడండి: రూ.1.10 కోట్లు లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన కీసర తహసీల్దార్

Last Updated : Aug 15, 2020, 12:45 PM IST

ABOUT THE AUTHOR

...view details