మేడ్చల్ జిల్లా కీసర తహసీల్దార్ లంచం కేసులో అనిశా దర్యాప్తు ముమ్మరం చేసింది. ప్రభుత్వ, అసైన్డ్, వివాదస్పద భూములు కాజేసేందుకు కుట్ర జరిగినట్లు అనుమానం వ్యక్తం చేసింది. రూ.కోటి 10 లక్షలు తీసుకుంటూ అ.ని.శా.కు చిక్కిన కీసర తహసీల్దార్ నాగరాజుతోపాటు అంజిరెడ్డి, శ్రీనాథ్‌కు డబ్బులు ఎక్కడ్నుంచి వచ్చాయనే అంశంపై ఆరా తీస్తున్నారు.
కీసర తహసీల్దార్ కేసులో అనిశా దర్యాప్తు ముమ్మరం - కీసర లంచం కేసులో దర్యాప్తు
సంచలనం సృష్టించిన కీసర తహసీల్దార్ లంచం కేసులో అనిశా దర్యాప్తు ముమ్మరం చేసింది. ప్రభుత్వ, అసైన్డ్, వివాదస్పద భూములు కాజేసేందుకు కుట్ర జరిగినట్లు అనుమానం వ్యక్తం చేసింది. గతంలో తహసీల్దార్ నాగరాజు అవినీతి అక్రమాలపై అనిశా దర్యాప్తు చేపట్టింది.
ఇంకా ఎవరైనా వీరి వెనక ఉన్నారా అనే కోణంలో అనిశా వివరాలు సేకరిస్తోంది. నలుగురు నిందితుల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేయనున్నారు. కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అనిశా అధికారులు తెలిపారు. తహసీల్దార్ ఇల్లు, కార్యాలయంలో లభ్యమైన ఆస్తులు, భూముల పత్రాలపై ఆరా తీశారు.
అంజిరెడ్డి ఇంట్లో దొరికిన రాజకీయ నేతలకు సంబంధించిన దస్త్రాలను పరిశీలిస్తున్నారు. కీసరా, మేడ్చల్, అల్వాల్, కుషాయిగూడలో పలు భూముల దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. రూ.కోటి 10 లక్షలపై ఐటీ శాఖకు లేఖ రాయనున్నారు. గతంలో తహసీల్దార్ నాగరాజు అవినీతి అక్రమాలపై అనిశా దర్యాప్తు చేపట్టింది.