ఓటుకు నోటు కేసు విచారణను ఏప్రిల్ 8 వ తేదీకి వాయిదా వేయాలన్న ఎంపీ రేవంత్ రెడ్డి పిటిషన్‌ను అనిశా న్యాయస్థానం తోసిపుచ్చింది. పార్లమెంటు సమావేశాలకు హాజరు కావల్సి ఉన్నందున విచారణ ప్రక్రియను వాయిదా వేయాలన్న రేవంత్ అభ్యర్థనను న్యాయస్థానం కొట్టి వేసింది.
విచారణ వాయిదా వేయాలన్న రేవంత్ పిటిషన్ కొట్టివేత
ఓటుకు నోటు కేసుపై అనిశా కోర్టులో విచారణ జరిగింది. విచారణ వాయిదా వేయాలన్న రేవంత్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 1కి వాయిదా వేసింది.
ఓటుకు నోటు కేసులో ఎంపీ రేవంత్‌రెడ్డికి చుక్కెదురు
రేవంత్ రెడ్డి తరఫున న్యాయవాది హాజరైనా.. సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేయవచ్చునన్న అనిశా వాదనతో కోర్టు ఏకీభవించింది. రేపటి నుంచి ఈనెల 29 వరకు న్యాయమూర్తి సెలవులో ఉండనున్నందున కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 1కి వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది.
ఇదీ చదవండి:బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ తుది కసరత్తు
Last Updated : Mar 15, 2021, 8:23 PM IST