తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏసీబీ వలలో అవినీతి తిమింగలం - boduppal municipality

కొంతమంది ప్రభుత్వ అధికారుల తీరు మారడం లేదు. ఎక్కడో ఓ చోట లంచం తీసుకుంటూనే ఉన్నారు. తాజాగా మేడ్చల్​ జిల్లా బోడుప్పల్​ మున్సిపాలిటీ సీనియర్​ అసిస్టెంట్​ రాజేందర్​ రెడ్డి రూ.50 వేల లంచం తీసుకుంటూ అనిశా చిక్కాడు.

ఏసీబీ వలకు అవినీతి తిమింగలం

By

Published : Nov 22, 2019, 5:26 PM IST

Updated : Nov 22, 2019, 5:47 PM IST

మేడ్చల్​ జిల్లా బోడుప్పల్​ మున్సిపల్​ పరిధిలో గుత్తేదారు వెంకటేశ్​ గౌడ్​ రూ.62 లక్షల అభివృద్ధి పనులు చేశాడు. బిల్లుల మంజూరు కోసం సీనియర్​ అసిస్టెంట్​ రాజేందర్ రెడ్డి లక్షా 80 వేల రూపాయల లంచం డిమాండ్​ చేశాడు. రెండురోజుల క్రితం లక్ష ఇచ్చాడు. మిగతా రూ.80 వేలు ఇచ్చే ముందు అనిశా అధికారులను ఆశ్రయించాడు. ప్రణాళిక ప్రకారం మున్సిపాలిటీ కార్యాలయంలో రూ.50 వేలు ఇస్తుండగా రాజేందర్​ రెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అతనితోపాటు అసిస్టెంట్​ ఆసిఫ్​ను సైతం అదుపులోకి తీసుకున్నారు.

ఏసీబీ వలకు అవినీతి తిమింగలం
Last Updated : Nov 22, 2019, 5:47 PM IST

ABOUT THE AUTHOR

...view details