తెలంగాణ

telangana

ETV Bharat / state

'మల్లారెడ్డిని మంత్రి పదవి నుంచి తొలిగించాలి' - telangana news

న్యాక్‌ అక్రిడేషన్ గుర్తింపు కొరకు తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించిన మంత్రి మల్లా రెడ్డికి వ్యతిరేకంగా ఏబీవీపీ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. మంత్రి హోదాలో ఉండి తప్పుడు పత్రాలు సమర్పించిన మల్లారెడ్డిని పదవి నుంచి తొలిొగించాలని డిమాండ్ చేశారు.

ABVP students demand revocation of colleges belonging to Minister Malla Reddy
మంత్రి మల్లా రెడ్డికి చెందిన కళాశాలల గుర్తింపు రద్దు చెయ్యాలంటూ ఏబీవీపీ విద్యార్థులు డిమాండ్

By

Published : Dec 26, 2020, 3:34 PM IST

మంత్రి మల్లారెడ్డికి చెందిన కళాశాలల గుర్తింపు రద్దు చేయాలంటూ ఏబీవీపీ విద్యార్థులు డిమాండ్ చేశారు. మేడ్చల్​ జిల్లా కూకట్‌పల్లి జేఎన్టీయూ ప్రధాన ద్వారం ఎదుట మంత్రికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. మంత్రి హోదాలో కొనసాగుతూ న్యాక్‌ అక్రిడేషన్ గుర్తింపు కొరకు తప్పుడు పత్రాలు సమర్పించిన మల్లారెడ్డిని మంత్రి పదవి నుంచి తొలిగించాలని డిమాండ్ చేశారు.

మంత్రి ఏర్పాటు చేస్తున్న డీమ్డ్ యూనివర్సిటీ గుర్తింపుతో పాటు ఆయనకు చెందిన మిగతా కళాశాలల గుర్తింపును సైతం రద్దు చేయాలని ఏబీవీపీ విద్యార్థులు డిమాండ్ చేశారు. తప్పుడు పత్రాలతో కళాశాలకు గుర్తింపు తెచ్చుకొని విద్యార్థుల భవష్యత్తుతో ఆడుకుంటే దాడులకు సైతం వెనుకాడబోమని హెచ్చరించారు.

ఇదీ చూడండి: మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలను బ్లాక్ లిస్టులో పెట్టిన న్యాక్

ABOUT THE AUTHOR

...view details