తెలంగాణ

telangana

ETV Bharat / state

ABVP leaders rally at JNTU: జేఎన్‌టీయూలో ఏబీవీపీ విద్యార్థి సంఘాల ర్యాలీ... స్వల్ప ఉద్రిక్తత - హైదరాబాద్‌ జిల్లా వార్తలు

పీహెచ్‌డీ సీట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఏబీవీపీ విద్యార్థి సంఘాల నేతలు జేఎన్‌టీయూలో నిరసన ర్యాలీ(ABVP leaders protest rally at JNTU) చేపట్టారు. ఎస్సీ ఎస్టీ సీట్లను ఓపెన్ కేటగిరి విద్యార్థులకు కేటాయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే విచారణ చేపట్టి డైరెక్టర్ వెంకటరమణారెడ్డిపై(JNTU Director Venkataramana reddy) చర్యలు తీసుకోవాలని కోరారు.

ABVP leaders rally at JNTU
ABVP leaders rally at JNTU

By

Published : Nov 15, 2021, 7:56 PM IST

జేఎన్‌టీయూలో ఏబీవీపీ విద్యార్థి సంఘాల నేతలు నిరసన ర్యాలీ(ABVP leaders protest rally at JNTU) చేపట్టారు. పీహెచ్‌డీ సీట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని డైరెక్టర్ ఛాంబర్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. డైరెక్టర్ వెంకటరమణారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో డైరెక్టర్‌కు విద్యార్థి నాయకులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.

వెంటనే విచారణ చేపట్టాలి..

ఎస్సీ, ఎస్టీ సీట్ల కేటాయింపు ఓపెన్ కేటగిరి విద్యార్థులకు కేటాయిస్తున్నారని విద్యార్థి నాయకులు ఆరోపించారు. ఎలాంటి ఉత్తర్వులు లేకుండా ఇష్టానుసారంగా ఎలా సీట్లను కేటాయిస్తారంటూ ప్రశ్నించారు. ఎలాంటి అవకతవకలు జరగకుంటే నిమ్మల శ్రీనివాసరావు అనే వ్యక్తికి సీటు ఎలా కేటాయించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. వెంటనే సీట్ల కేటాయింపుపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు. వెంటనే విచారణ చేపట్టి డైరెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని రిజిస్టర్‌కు వినతి పత్రం అందజేశారు.

సీట్ల కేటాయింపు నా ఒక్కరి పరిధి కాదు..

సీట్ల కేటాయింపులో ఎలాంటి అవకతవకలు జరగలేదని జేఎన్‌టీయూ డైరెక్టర్ వెంకటరమణారెడ్డి(JNTU Director Venkataramana reddy) అన్నారు. పీహెచ్‌డీ సీట్ల కేటాయింపు అనే విషయం తన ఒక్కరి పరిధిలోనిది కాదని తెలిపారు. దీనిపై కమిటీ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో నియామకాలు జరగడమనేది ఓ క్రమ పద్ధతిలో ఉంటుందని అన్నారు.

ఇదీ చదవండి:Warangal KMC: 'ర్యాగింగ్​పై ఎలాంటి ఫిర్యాదు అందలేదు.. ఆ ట్వీట్​లో నిజం లేదు'

ABOUT THE AUTHOR

...view details