ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయసు పెంపును నిరసిస్తూ హైదరాబాద్ కూకట్‌పల్లిలోని జాతీయ రహదారిపై ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు.
'ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలి' - hyderabad news
వయోపరిమితి పెంపునకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. కూకట్‌పల్లిలోని జాతీయ రహదారిపై ఏబీవీపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు.
abvp dharna
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ అవలంభిస్తోన్న విధానాల వల్ల విద్యార్థులు నష్టపోతున్నారని, నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోందని అన్నారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.
ఇదీ చదవండి:ఖాతాదారులకు గమనిక: బ్యాంకులకు వరుస సెలవులు