మేడ్చల్ జిల్లా జవహార్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో ఆసరా ఫించన్ల కోసం వృద్ధులు, వితంతువులు బారులు తీరారు. భౌతిక దూరం పాటించకుండా లైన్లో నిలుచున్నారు. అక్కడ వారికి చెప్పడానికి అధికారులు, పోలీసులు లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
ఏమిటీ నిర్లక్ష్యం.. కనిపించని భౌతిక దూరం - తెలంగాణ వార్తలు
కరోనా విలయతాండవం చేస్తోన్న వేళ భౌతిక దూరం పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఆసరా ఫించన్‌దారులు. అధికారులు కూడా పట్టిపట్టనట్లు ఉండటంతో విమర్శలు వస్తున్నాయి.
ఏమిటీ నిర్లక్ష్యం.. కనిపించని భౌతిక దూరం
కరోనా విలయతాండవం చేస్తున్న వేళ దాదాపు 200 మంది భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా చేరారు. ఇందులో ఒక్కరి కొవిడ్ ఉన్నా వారందరికీ వచ్చే ప్రమాదం ఉంది.
ఇదీ చదవండి:ప్రాణాన్ని బలిగొన్న.. ఫార్వర్డ్ సందేశం