భవనంపై నుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి ఠాణా పరిధిలో జరిగింది. ఎంజే కాలనీకి చెందిన మేరీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
భవనంపై నుంచి దూకి వివాహిత ఆత్మహత్య - hyderabad crime news
మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి ఠాణా పరిధిలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. స్థానిక ఎంజే కాలనీకి చెందిన మేరీ... భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది.
భవనంపై నుంచి దూకి వివాహిత ఆత్మహత్య
కుటుంబ కలహాలతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి:భారత్లో 107కు చేరుకున్న కరోనా కేసులు