మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఇళ్లను తమకు కేటాయించాలని ముగ్గురు మహిళలు ఆందోళనకు దిగారు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని కుతాడి లక్ష్మీ అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. గతంలో కూడా న్యాయం చేస్తామని పోలీసులు, అధికారులు హామీ ఇచ్చారన్నారు. కానీ తమకు ఎలాంటి న్యాయం జరగలేదని వాపోయారు.
డబుల్ బెడ్ రూం ఇవ్వాలని మహిళ ఆత్మహత్యాయత్నం - మేడ్చల్ మల్కాజిగిరి తాజా వార్తలు
తమకు డబుల్ బెడ్ రూంలు ఇచ్చి న్యాయం చేయాలని మేడ్చల్ జిల్లాలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కొద్దిరోజులు క్రితం తమకు ఇళ్లు ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారని.. అయినా తమకు ఎలాంటి న్యాయం జరగలేదని ముగ్గురు మహిళలు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.
డబుల్ బెడ్ రూం ఇవ్వాలని ఆత్మహత్యాయత్నం
ఎన్ని దరఖాస్తులు పెట్టినా రద్దు అవుతున్నాయని బాధితురాలు ఆందోళన చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని సఖి కౌన్సెలింగ్ కేంద్రానికి పంపించారు. కొన్ని నెలల క్రితం కూడా కలెక్టర్ కార్యాలయం ముందు లక్ష్మీ ఆత్మహత్య ప్రయత్నం చేసింది.
ఇదీ చూడండి: వంట నూనెల ధరల్లో ఈ మార్పు గమనించారా?