Wife protest for husband : భర్త ఇంటిముందు ఓ వివాహిత ధర్నాకు దిగింది. తన భర్త... తనకు కావాలని డిమాండ్ చేస్తోంది. న్యాయం జరిగేంతవరకు పోరాటం చేస్తానని స్పష్టం చేసింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోతుకుంటకు చెందిన... సందీప్ రెడ్డి, శ్రీలతకు 2012లో వివాహం జరిగింది. కొన్నాళ్లు బాగానే సంసారం సాగినప్పటికీ... ఆ తర్వాత గొడవలు మొదలయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు తాము కలిసి ఉండడం లేదని... తన భర్త తనను దూరం పెట్టాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నిత్యం మద్యం సేవించే అలవాటున్న తన భర్త... తల్లిదండ్రుల ఒత్తిడి వల్లే తనను పెళ్లి చేసుకున్నానని చాలాసార్లు చెప్పినట్లు వాపోయింది.
ఇప్పటికే చాలాసార్లు ఫోన్ చేసినప్పటికీ... స్పందించలేదని శ్రీలత తెలిపింది. తన భర్తతోనే కలిసి ఉంటానని చెప్పింది. సందీప్‌తో కలిసి ఉండేలా... తనకు న్యాయం చేయాలని కోరుతూ ధర్నాకు దిగింది. అత్తగారింట్లో రావడానికి తనకు అనుమతి వచ్చే వరకు ధర్నా చేస్తానని తేల్చి చెప్పింది. పోలీసులు, కోర్టులను సందీప్ పక్కదోవ పట్టించే యత్నం చేస్తున్నారని శ్రీలత ఆరోపించింది.