తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈటీవీ భారత్​ కథనానికి స్పందన - మేడ్చల్​ జిల్లా వార్తలు

'కాలిబాటపై మృతదేహం.. తండ్రి కోసం పిల్లల ఆరాటం' అనే శీర్షికతో ఈటీవీ భారత్​లో వచ్చిన కథనానికి మేడ్చల్‌ జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఓ ఉద్యోగి స్పందించారు. రూ.1000లతో పాటు నిత్యావసరాలు అందించారు.

A man help to poor family in medchal district
ఈటీవీ భారత్​ కథనానికి స్పందన

By

Published : May 3, 2020, 3:35 PM IST

కర్ణాటకలోని బీదర్‌కు చెందిన ఓ కుటుంబం జీవనోపాధి కోసం మేడ్చల్‌ జిల్లా బోడుప్పల్​కు వచ్చి నివాసం ఉంటోంది. ట్రాక్టర్‌ డ్రైవర్‌(45)గా పని చేస్తున్న ఇంటి పెద్ద.. గురువారం హైదరాబాద్‌లోని బొగ్గులకుంట కూడలిలోని కాలిబాటపై మృతి చెందాడు. అతని వద్ద లభించిన ఆధారాలతో నారాయణగూడ పోలీసులు మేడిపల్లి స్టేషన్​కు సమాచారం అందించారు. మేడిపల్లి పోలీసుల సమక్షంలో జీహెచ్‌ఎంసీ రాత్రికి రాత్రే దహన సంస్కారాలు పూర్తి చేసింది. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ఈ విషయమై 'కాలిబాటపై మృతదేహం... తండ్రి కోసం పిల్లల ఆరాటం' అనే శీర్షికతో ఈటీవీ భారత్​లో వచ్చిన కథనానికి మేడ్చల్‌ జిల్లా కీసర డివిజన్‌ ప్రభుత్వ ఆరోగ్య సిబ్బంది శిక్షకులు వీపూరి రవికుమార్‌ స్పందించారు. శనివారం మృతుడి భార్యను కలిసి వారానికి సరిపడా నిత్యావసర సరకులు, పిల్లలకు బిస్కెట్లు, నగదు రూ.1000 అందజేశారు.

ఇదీ చూడండి : కాలిబాటపై మృతదేహం... తండ్రి కోసం పిల్లల ఆరాటం

ABOUT THE AUTHOR

...view details