జగద్గిరిగుట్టలో తుపాకీతో యువకుడి వీరంగం - జగద్గిరిగుట్ట వార్తలు
![జగద్గిరిగుట్టలో తుపాకీతో యువకుడి వీరంగం gun](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11398174-thumbnail-3x2-fhsdnsa.jpg)
13:04 April 14
జగద్గిరిగుట్టలో తుపాకీతో యువకుడి వీరంగం
హైదరాబాద్ కూకట్‌పల్లిలో నివాసముండే హర్షారెడ్డి ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని ఫైరింగ్ రేంజ్లో ప్రాక్టీస్ చేస్తున్న అతను మంగళవారం రాత్రి ఎల్లమ్మ బండలోని లాస్య మద్యం దుకాణం మూసేసే సమయానికి అక్కడికి వెళ్లాడు.
కారు సైరన్ వేసి హల్చల్ చేశాడు. దుకాణం వద్ద రద్దీగా ఉండటంతో దిలీప్ అనే వ్యక్తితో వాగ్వాదానికి దిగాడు. తన వద్దనున్న ఎయిర్ తుపాకీతో హల్చల్ చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇదీ చదవండి:అంబేడ్కర్‌కు సంబంధించిన స్థలాలను పంచ తీర్థాలుగా చేశాం: కిషన్ రెడ్డి