మేడ్చల్ జిల్లా, దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో క్వారీ గుంతలో రాళ్లు కొడుతున్న వ్యక్తిపై రాళ్లు పడి మృతిచెందాడు. జవహర్‌నగర్‌కు చెందిన నాగరాజుకు భార్య ముగ్గురు పిల్లలతో బతుకుదెరువుకోసం దుండిగల్ ఠాణా పరిధిలోని కైసర్‌నగర్‌కు వలసొచ్చాడు. స్థానికంగా ఇల్లు అద్దెకు తీసుకొని క్వారీలో రాళ్లు కొట్టుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
క్వారీలో రాళ్లు కొడుతుండగా ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి - A man dies while throwing stones at a quarry in dundigal
క్వారీ గుంతలో రాళ్ళు కొడుతున్న వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన దుండిగల్ ఠాణా పరిధిలో జరిగింది. గుంతలో రాళ్లు కొడుతుండగా పైన టిప్పర్ అన్లోడ్ చేయడం రాళ్లు మీదపడి మృతిచెందాడు.
![క్వారీలో రాళ్లు కొడుతుండగా ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి A man dies while throwing stones at a quarry in dundigal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5413338-thumbnail-3x2-quary-rk.jpg)
క్వారీలో రాళ్లు కొడుతుండగా ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి
రోజుమాదిరి గానే క్వారీ గుంతలో రాళ్లు కొడుతుండగా క్వారీ పైనుంచి లారీలో రాళ్లను అన్లోడ్ చేయడం వల్ల రాళ్లు మీద పడడం వల్ల నాగరాజు ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదాన్ని గుర్తించిన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
క్వారీలో రాళ్లు కొడుతుండగా ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి
ఇదీ చూడండి: చిన్నారిని కిడ్నాప్ చేశాడు..పోలీసులకు లొంగిపోయాడు..