తెలంగాణ

telangana

ETV Bharat / state

టిప్పర్​ ఢీకొని వ్యక్తి మృతి - road accident at dundigal

పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా టిప్పర్ ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మేడ్చల్​ జిల్లా దుండిగల్ పీఎస్​ పరిధిలో చోటుచేసుకుంది.

accident
accident

By

Published : Jan 10, 2020, 9:46 PM IST

మేడ్చల్ జిల్లా దుండిగల్​లో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని టిప్పర్​ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బాచుపల్లి, ఇందిరానగర్​కు చెందిన నర్సింహులు (32) కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజులాగే మల్లంపేట్​లో పని చేసి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

సమాచారం అందుకున్న దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

టిప్పర్​ ఢీకొని వ్యక్తి మృతి

ఇదీ చూడండి: సీఏఏను ఉపసంహరించుకోండి: అసద్

ABOUT THE AUTHOR

...view details