తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనాపై అవగాహన.. మైక్ పట్టుకుని వీధుల్లో ప్రచారం - కూకట్​పల్లిలో కరోనాపై అవగాహన

కరోనాపై అవగాహన కల్పించేందుకు వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఓ వ్యక్తి. కూకట్​పల్లికి చెందిన 52 ఏళ్ల బొచ్చు లోకాజీ చేతిలో మైక్ పట్టుకుని వీధుల్లో తిరుగుతూ అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు, భౌతికదూరం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

a man awareness on corona
కరోనాపై అవగాహన కల్పిస్తున్న లోకాజీ

By

Published : May 18, 2021, 9:10 PM IST

కొవిడ్​పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విభిన్న మార్గంలో ప్రచారం చేస్తున్నారు. మహమ్మారిపై జాగ్రత్తలు వివరిస్తూ వీధుల వెంట తిరుగుతున్నారు. హైదరాబాద్​లోని కూకట్​పల్లికి చెందిన 52 ఏళ్ల బొచ్చు లోకాజీ మాస్కులు, భౌతిక దూరం ప్రతి ఒక్కరు పాటించాలని చెబుతున్నారు.

కరోనాతో తన అన్నను కోల్పోయానని అందుకే నేను కొవిడ్​ను జయించి అవగాహన కల్పిస్తున్నానని తెలిపారు. తనలాగా మరో కుటుంబం బలి కాకూడదనే ఉద్దేశంతో చేతిలో చిన్న బుర్ర పట్టుకొని, విచిత్ర వేషాధారణతో బయటకు వచ్చే ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలా ప్రతి రోజు వీధుల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. తనను చూసి మాస్కులు పెట్టుకుంటున్నారని.. భౌతిక దూరం పాటిస్తున్నారని ఆయన చెబుతున్నారు. ఈ ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. గతంలో శిల్పారామంలో ఉద్యోగం చేసే వాడినని... ప్రస్తుతం నిరుద్యోగిగా ఉన్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details