మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాజీ సర్పంచ్ బండారి నరేందర్ చిన్న కుమారుడు డా.యశ్వంత్ జీడిమెట్లలోని ఓ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నాడు. విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్న క్రమంలో ఓ గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ప్రమాదంలో యశ్వంత్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. దిగ్భ్రాంతి కలిగించే విషమేంటంటే... వైద్యుడు శిరస్త్రాణం ధరించినా ఫలితం లేకపోయింది. హెల్మెట్ ముక్కలుముక్కలైంది. మృతదేహాన్ని చూసి అతని తల్లి రోధిస్తుంటే... అందరి కళ్లు చమర్చాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని వెతికే పనిలో పడ్డారు.
ఇంటికి వెళ్లాల్సిన వైద్యుడు... నేరుగా అనంతలోకాలకు... - LATEST CRIME NEWS
ప్రాణాలు పోసే వైద్యుడు అతను... కానీ తన ప్రాణాన్ని మాత్రం కాపాడుకోలేకపోయాడు. ఆస్పత్రిలో సేవలందించి ఇంటికి పయనమైన ఆ డాక్టర్... అనంతలోకాలకు వెళ్లిపోయాడు. గుర్తు తెలియని ఓ మృత్యుశకటం చేసిన ప్రమాదం నుంచి... తాను ఎంతో మందిని రక్షించిన పుణ్యమే కాదు అతను ధరించిన శిరస్త్రాణమూ ఆ వైద్యున్ని రక్షించలేకపోయింది.
A DOCTOR DIED IN ROAD ACCIDENT AT GUNDLAPOCHAMPALLY