TRS VS MRPS at Jawaharnagar : హైదరాబాద్ జవహర్‌నగర్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద తెరాస, ఎమ్మార్పీఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రాజ్యాంగాన్ని మార్చాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ నాయకులు నిరసన తెలుపుతుండగా... ఆ సమయంలో అక్కడే తెరాస నాయకులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది.
ఎమ్మార్పీఎస్ VS తెరాస కార్యకర్తలు.. అంబేడ్కర్ విగ్రహం వద్ద ఉద్రిక్తత - తెలంగాణ రాజకీయాలు
TRS VS MRPS at Jawaharnagar : జవహర్‌నగర్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఉద్రిక్తత నెలకొంది. తెరాస, ఎమ్మార్పీఎస్ కార్యకర్తల నడుమ తోపులాట జరిగింది. తెరాస నాయకులు అంబేడ్కర్ విగ్రహం వద్ద పూలమాలలు వేయకూడదంటూ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు.
ఎమ్మార్పీఎస్-తెరాస కార్యకర్తల మధ్య తోపులాట
ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు, తెరాస నాయకుల మధ్య పరస్పరం తోపులాట జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు... ఇరువర్గాలను చెదరగొట్టారు. తెరాస నాయకులు అంబేడ్కర్ విగ్రహం వద్ద పూలమాలలు వేయకూడదంటూ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. రాజ్యాంగం పట్ల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:తెలంగాణ మొత్తం తనకు జీ హుజూర్.. అనాలని కేసీఆర్ భావన: కిషన్‌రెడ్డి