తెలంగాణ

telangana

ETV Bharat / state

నిర్బంధ తనిఖీల్లో 52 ద్విచక్రవాహనాల స్వాధీనం - The cyberabad police conducted sub-inspections in Subhash Nagar.

జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్ నగర్​లో సైబరాబాద్ పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 52 ద్విచక్రవాహనాలు, రెండు కార్లు, ఒక ఆటో, 9 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

52 bicycles in custody checks at subashnagar
నిర్బంధ తనిఖీల్లో 52 ద్విచక్రవాహనాలు

By

Published : Dec 17, 2019, 5:41 AM IST

సైబరాబాద్ పోలీసులు జీడిమెట్ల పీఎస్​ పరిధిలోని సుభాష్ నగర్​లో నిర్బంధ తనిఖీలు చేశారు. స్థానికుల ధ్రువపత్రాలు, ఆధార్ కార్డులు తనిఖీలు చేశారు. 9మంది అనుమానితులు, సరైనపత్రాలు లేని 52 ద్విచక్రవాహనాలు, 2 కార్లు, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

బాలానగర్ డీసీపీ పద్మజ ఆధ్వర్యంలో సుమారు 90 మంది పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఎలాంటి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నామని బాలానగర్ ఏసీపీ పురుషోత్తం యాదవ్ అన్నారు. అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా తగు జాగ్రత్తలు చేపడుతున్నామని తెలిపారు.

నిర్బంధ తనిఖీల్లో 52 ద్విచక్రవాహనాలు

ఇదీ చూడండి : పెరిగిన మద్యం ధరలు... ఎల్లుండి నుంచి అమల్లోకి...

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details