నకిలీ విత్తనాలపై ముఖ్యమంత్రి పదేపదే సీరియస్ అయినప్పటికీ కొందరు అక్రమార్కులు అడ్డదారులు తొక్కుతున్నారు. కేవలం డబ్బు సంపాదనే లక్ష్యంగా నకిలీ విత్తనాలను అమాయకులైన రైతులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా ఈ రోజు మేడ్చల్ జిల్లా కండ్లకోయ వద్ద ఈకో అగ్రి సీడ్స్ గోదాంలో నకిలీ విత్తనాలు నిల్వ ఉన్నాయన్న సమాచారం మేరకు విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు.
31 లక్షల రూపాయలు విలువ చేసే నకిలీ విత్తనాలు సీజ్
మేడ్చల్ జిల్లా కండ్లకోయ వద్ద ఉన్న ఈకో అగ్రి సీడ్స్ గోదాంలో నిల్వ ఉన్న నకిలీ విత్తనాలను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. దాదాపు 31 లక్షల రూపాయల విలువ చేసే ఆ విత్తనాలను సీజ్ చేశారు.
31 లక్షల రూపాయలు విలువ చేసే నకిలీ విత్తనాలు సీజ్
సుమారు 31 లక్షల విలువచేసే నకిలీ పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, జొన్న విత్తనాలు స్వాధీనం చేసుకొని వాటిని సీజ్ చేశారు. తదుపరి చర్యలకు పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి:కేంద్ర విద్యుత్తు చట్టంపై కేసీఆర్ గుస్సా..