తెలంగాణ

telangana

ETV Bharat / state

భారీ మొత్తంలో రేషన్​ బియ్యం స్వాధీనం... ముగ్గురు అరెస్టు - malkajigiri news

మేడ్చల్​ జిల్లా మల్కాజిగిరి పోలీస్​స్టేషన్​ పరిధిలోని బీజేఆర్​ నగర్​లోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వఉంచిన రేషన్​ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోగా... 26 క్వింటాళ్ల బియ్యాన్ని, ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

26  Quintals of rice caught by malkajigiri police
26 Quintals of rice caught by malkajigiri police

By

Published : Jul 11, 2020, 6:55 PM IST

అక్రమంగా నిలువ ఉంచిన భారీ మొత్తం రేషన్ బియ్యాన్ని మల్కాజిగిరి పోలీసులు పట్టుకున్నారు. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి పోలీస్​స్టేషన్ పరిధిలోని బీజేఆర్​నగర్​లోని ఓ ఇంట్లో రేషన్​ బియ్యాన్ని ముగ్గురు సభ్యుల ముఠా అక్రమంగా నిలువ ఉంచింది. వీటిని నిజామాబాద్, కర్ణాటక రాష్ట్రంలోని బీదర్​కు తరలిస్తున్నారు.

ఇంటిపై దాడి చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 26 క్వింటాళ్ల బియ్యంతో పాటు ఒక అశోక్ లేలాండ్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చూడండి:మీ ఇంటికే కరోనా కిట్.. హోం ఐసొలేషన్ బాధితులకు మాత్రమే..!

ABOUT THE AUTHOR

...view details