తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆరుబయట నిద్రపోతున్న పదేళ్ల బాలికపై అత్యాచారం - హైదరాబాద్​లో అత్యాచార వార్తరలు

తల్లిదండ్రులు పనికి వెళ్లగా అమ్మమ్మ వద్ద ఉన్న పదేళ్ల బాలికను ఓ కామాంధుడు కాటేశాడు. శేరిలింగంపల్లి వాంబే కాలనీకి చెందిన బాలిక రాత్రి అమ్మమ్మతో కలిసి ఆరుబయట నిద్రపోయింది. దీనిని గమనించిన స్థానిక యువకుడు ఆమె నోరు నొక్కేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

10 Years  girl raped in Hyderabad
పదేళ్ల బాలికపై అత్యాచారం

By

Published : May 30, 2020, 3:02 PM IST

మేడ్చల్​ జిల్లా శేరిలింగంపల్లి పాపిరెడ్డి కాలనీ వాంబే నివాస సముదాయాల్లో ఓ పేద కుటుంబం ఉంటోంది. ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. కరోనా కారణంగా పని లేకపోవడంతో భార్యాభర్తలు తమ పెద్ద కుమార్తెను తీసుకొని పటాన్‌చెరులోని ఓ పరిశ్రమలో పనిచేయడానికి వెళ్లారు. చిన్న కుమార్తెను, ఆమె అమ్మమ్మను ఇంటి దగ్గర ఉంచారు. వేసవి కావటం ఉక్కపోస్తుందని రాత్రి చిన్నారి, వృద్ధురాలు బయట పడుకున్నారు.

ఇదే ప్రాంతానికి చెందిన నిందితుడు అర్ధరాత్రి దాటిన తరువాత వచ్చి ఆ చిన్నారి నోరు మూసేసి గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అలికిడికి పక్కింటిలో ఉంటున్న బాలిక బంధువు బయటకి వచ్చి ఇక్కడేం చేస్తున్నావని ప్రశ్నించడం వల్ల అక్కడ నుంచి పరారయ్యాడు. గదిలోకి వెళ్లి అపస్మారక స్థితిలో ఉన్న బాలికను ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details