మెదక్ జిల్లాలో మిషన్ భగీరథ నీళ్లు వృథాగా పోవడంపై ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. తాగునీటి అవసరాలకు ఆ నీటిని వినియోగించకుండా.. ఇతరత్రా వాటికి అధికారులు వినియోగిస్తున్నారని నిలదీశారు. కలెక్టరేట్‌లో జడ్పీ ఛైర్‌పర్సన్ హేమలత గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది.
మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ఆర్‌డబ్ల్యూఎస్‌కు ఫిర్యాదులు వస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. స్పందించిన కలెక్టర్ ఎస్. హరీశ్.. గ్రామాల వారీగా మూడురోజుల్లో సమస్యలను పరిష్కరించాలని ఆర్‌డబ్ల్యూఎస్ ఏఐ కమలాకర్‌ను ఆదేశించారు.