తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కలెక్టర్​కు వినతిపత్రం! - కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలి

కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని, రాష్ట్రవ్యాప్తంగా పరీక్షల సంఖ్య పెంచాలని వైసీపీ విద్యార్థి విభాగం మెదక్​ జిల్లా అధ్యక్షులు టి నరేష్​ డిమాండ్​ చేశారు. ఈ మేరకు మెదక్​ జిల్లా అదనపు కలెక్టర్​కు వినతి పత్రం అందజేశారు. పాజిటివ్​ కేసులు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలందరికీ విస్తృతంగా వైద్య సేవలు అందించాలని ఆయన డిమాండ్​ చేశారు.

Ysrcp Student Wing Leader  Gives Request Letter To Medak Additional Collector
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కలెక్టర్​కు వినతిపత్రం!

By

Published : Aug 18, 2020, 3:54 PM IST

కరోనా కేసులను ఆరోగ్య శ్రీలో చేర్చి.. ప్రజలందరికీ ఉచితంగా వైద్య సేవలు అందించాలని వైసీపీ విద్యార్థి విభాగం మెదక్​ జిల్లా అధ్యక్షులు టి నరేశ్​ డిమాండ్​ చేశారు. రోజురోజుకు కొవిడ్​ పాజిటివ్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ర్యాపిడ్​ టెస్టుల సంఖ్య పెంచి.. ప్రజలను విపత్కర పరిస్థితుల నుంచి కాపాడాలని కోరారు. ఈ మేరకు మెదక్​ జిల్లా అదనపు కలెక్టర్​ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో రోజురోజుకు పాజిటివ్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు కరోనాను నివారించేందుకు చర్యలు వేగవంతం చేయాలని కోరారు. కొవిడ్​ బాధితులందరికీ ఆరోగ్య శ్రీ వర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రైవేటు ఆసుపత్రిలలో కరోనా పరీక్షలు, చికిత్స ఉచితంగా అందించాలని డిమాండ్​ చేశారు. బాధితుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్న ప్రైవేటు, కార్పొరేటు ఆస్పత్రుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

వైరస్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని, వైద్యశాఖలో ఖాళీగా ఉన్న 20వేల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కరోనా బారిన పడిన వారికి మెరుగైన వైద్యం కోసం ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించాలని కోరారు. లేని పక్షంలో వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్తిక్ ,సాయిబాబా, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి :పిల్లల అమ్మకాలకు ఏజెంట్​ వ్యవస్థ.. 'సృష్టి'oచిన ఆసుపత్రి

ABOUT THE AUTHOR

...view details