YS Sharmila Raithu Yatra: ప్రభుత్వ నిరంకుశ విధానాలతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడడం తనను ఆవేదనకు గురిచేసిందని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. అందుకే రైతు ఆవేదన యాత్రను చేపడుతున్నట్లు వైయస్ షర్మిల పేర్కొన్నారు. యాసంగిలో వరి వేయవద్దని కేసీఆర్ చెప్పడం.. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు.
sharmila comments on KCR: ఏడేళ్లలో ఇప్పటిదాకా 7 వేల మందికి పైగా ఆత్మహత్యలు చేసుకోగా.. గత రెండేళ్లలోనే 200 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం అందజేయాలని వైయస్ షర్మిల డిమాండ్ చేశారు. అందులో భాగంగా రైతు కుటుంబాలకు భరోసాను కల్పించేందుకు రైతు ఆవేదన యాత్రను చేపడుతున్నామన్నారు