తెలంగాణ

telangana

ETV Bharat / state

'సీఎం ప్రకటన వల్ల నష్టపోయిన రైతులకు తెరాస ఖాతా నుంచి పరిహారం చెల్లించాలి' - మెదక్ జిల్లా తాజా వార్తలు

YS Sharmila: వరివేయద్దన్న సీఎం ప్రకటన వల్ల నష్టపోయిన రైతులకు తెరాస ఖాతాలో ఉన్న డబ్బుల నుంచి పరిహారం చెల్లించాలని వైతెపా అధ్యక్షురాలు షర్మిల డిమాండ్‌ చేశారు. మెదక్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

YS SHARMILA
వైఎస్ షర్మిల

By

Published : May 7, 2022, 9:16 PM IST

YS Sharmila: మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న అక్రమాలు బయట పెట్టడానికి ఇక్కడికి వచ్చానని వైతెపా అధ్యక్షురాలు షర్మిల అన్నారు. వరివేయద్దన్న సీఎం ప్రకటన వల్ల నష్టపోయిన రైతులకు తెరాస ఖాతాలో ఉన్న డబ్బుల నుంచి పరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్​ను సందర్శించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

సీఎం ప్రకటన వల్ల నష్టపోయిన రైతులకు తెరాస ఖాతా నుంచి పరిహారం చెల్లించాలి

గత 20 రోజులుగా రైతులు ఇక్కడే ఉన్న ఏ అధికారి వారిని పట్టించుకున్న పాపాన పోలేదని వైఎస్ షర్మిల ఆరోపించారు. ఈరోజు తాను వస్తున్నానని తెలిసి అధికారులు విధులకు హాజరు కాలేదన్నారు. జిల్లాలో ప్రతి కిలోమీటర్​కు ఒక కల్లం ఉంది..కల్లం నిండా వడ్లు ఉన్నాయని... వాటిని కొనే నాథుడు లేడని ఆమె విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వం దిల్లీకి వెళ్లి కేంద్రం మెడలు వంచి ధాన్యం కొనుగోళ్లు చేయిస్తాని వచ్చి... ఓటమిని ఒప్పుకొని తామే కొంటామని చెప్పారని షర్మిల తెలిపారు. ఈ మాట చెప్పి ఇప్పటికే నెలరోజులు అయ్యిందని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మాదిరిగానే ఇది కూడా అబద్దమేనా అని ప్రశ్నించారు.

"తెరాస ఖాతాలో రూ.860 కోట్లు ఉన్నాయి. వాటికి వడ్డీ ప్రతి నెల రూ.3కోట్లు వస్తాయి. సంతకం పెట్టి వచ్చి తప్పు చేసింది కేసీఆర్. వరి వస్తే ఉరి అని బెదిరించింది కేసీఆర్. అందువల్ల దాదాపు 17లక్షల ఎకరాల పొలాలను రైతులు బీడు భూములుగా ఉంచారు. వారికి ఎకరానికి రూ.30వేల చొప్పున తెరాస ఖాతా నుంచి డబ్బులు ఇవ్వాలి." - వైఎస్ షర్మిల వైతెపా అధ్యక్షురాలు

ఇదీ చదవండి:రాష్ట్ర సంపదనంతా ఒక కుటుంబం దోచుకుంటోంది: రాహుల్‌గాంధీ

డ్రైవర్​ను వరించిన అదృష్టం.. రాత్రికి రాత్రే రూ.2కోట్ల జాక్​పాట్​

ABOUT THE AUTHOR

...view details