తెలంగాణ

telangana

ETV Bharat / state

మహా శివరాత్రి జాతరకు సిద్ధమవుతోన్న ఏడుపాయలు

మహా శివరాత్రి సందర్భంగా మెదక్​ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల్లో జరిగే వనదుర్గామాత మహా జాతరకు సర్వం సిద్ధమవుతోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు.

By

Published : Feb 18, 2020, 5:48 PM IST

yedupayala-temple-in-medak-prepared-for-the-occasion-of-mahashivaratri-festival
మహా శివరాత్రి జాతరకు సిద్ధమవుతోన్న ఏడుపాయలు

మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయలు మహా శివరాత్రి జాతరకు ముస్తాబవుతోంది. ఈనెల 21 నుంచి 23వ వరకు మూడు రోజుల పాటు జాతర ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మహా జాతరకు ఆంధ్రప్రదేశ్​, మహారాష్ట్ర, కర్ణాటక, ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆలయ ఈవో శ్రీనివాస్​ తెలిపారు.

మంచినీరు, స్నానఘట్టాలు, దారి పొడవునా విద్యుత్ లైట్ల ఏర్పాటు పూర్తి చేసినట్లు ఆలయ ఈవో తెలిపారు. మూడు రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, సహస్ర కుంకుమార్చన, పుష్పార్చన వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయని ఆలయ అర్చకులు పార్థివ శర్మ తెలిపారు.

మహా శివరాత్రి జాతరకు సిద్ధమవుతోన్న ఏడుపాయలు

ఇదీ చూడండి: మేడారం: 7రోజుల్లో రూ.10కోట్ల హుండీ ఆదాయం

ABOUT THE AUTHOR

...view details