తెలంగాణ

telangana

'మాస్కు, గ్లౌజు, షూస్ లేకుండా వర్కర్లు పనిచేయొద్దు'

మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో కరోనా వైరస్​పై మంత్రి హరీశ్​రావు సమావేశం నిర్వహించారు. మాస్కు, గ్లౌజు, షూస్ లేకుండా శానిటరీ వర్కర్లు పనిచేయొద్దని మంత్రి సూచించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ స్వచ్ఛందంగా ఇళ్లలోనే ఉండాలని కోరారు.

By

Published : Apr 4, 2020, 7:16 PM IST

Published : Apr 4, 2020, 7:16 PM IST

Workers without mask, gloves, shoes in medak district
'మాస్కు, గ్లౌజు, షూస్ లేకుండా వర్కర్లు పనిచేయోద్దు'

మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో కొవిడ్​-19​పై మంత్రి హరీశ్​రావు సమావేశం జరిపారు. కరోనా వ్యాప్తిపై ప్రజాప్రతినిధులు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్​లకు విధి విధానాలు తెలియజేశారు. లాక్​డౌన్ వల్ల జిల్లాలో ఒక్క యాక్సిడెంట్ కూడా జరగలేదని అన్నారు. వివిధ దేశాల నుంచి 120 మంది ఇక్కడికి వచ్చారని తెలిపారు. వారిలో 95 మందిని హోమ్ క్వారటైన్​లో ఉంచామని పేర్కొన్నారు. విద్య, ఉద్యోగం, ఉపాధి కోసం వివిధ దేశాలకు వెళ్లి వచ్చిన వారితో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

మెదక్ ప్రభుత్వాసుపత్రిలో 15 పడకల ఐసోలేషన్ వార్డు, 8 పడకల ఐసీయూ ఏర్పాటు చేశామన్నారు. కారోనా వ్యాధి లక్షణాలు కనబడితే మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని విజ్ఞప్తి చేశారు. రేషన్ దుకాణాల్లో బియ్యం పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు. లబ్ధిదారులు సామాజిక దూరం పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్ పర్సన్ హేమలత, కలెక్టర్ ధర్మారెడ్డి, అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు, మెదక్, నర్సాపూర్ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి :'మాస్కు, గ్లౌజు, షూస్ లేకుండా వర్కర్లు పనిచేయోద్దు'

ABOUT THE AUTHOR

...view details