తెలంగాణ

telangana

ETV Bharat / state

వడదెబ్బకు గురై ఉపాధి హామీ కూలీ మృతి

ఉపాధి హామీ కూలీ వడదెబ్బకు గురై మృతి చెందిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. నారాయణ బ్రాహ్మణకుంటలో ఉపాధి హామీ కూలి పనులకు వెళ్లాడు. నిన్న మధ్యాహ్నం అస్వస్థతకు గురై కుప్పకూలడం వల్ల 108లో ఆసుపత్రికి తరలిస్తుండగా గ్రామ శివారులో మృతి చెందాడు.

By

Published : May 13, 2020, 9:43 AM IST

workers-death-guaranteed-due-to-sunstroke-in-medak-disrict
వడదెబ్బకు గురై ఉపాధి హామీ కూలీ మృతి

పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఉపాధి హామీ కూలీ వడదెబ్బకు గురై మృతి చెందిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన చింతమడక నారాయణ బ్రాహ్మణకుంటలో ఉపాధి హామీ కూలి పనులకు వెళ్లాడు. అక్కడ అస్వస్థతకు గురై కుప్పకూలడం వల్ల తోటి కూలీలు 108 వాహనంలో చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా గ్రామ శివారులో మృతి చెందాడు.

మృతుడికి భార్య బాల లక్ష్మీ, కుమారులు యాదగిరి, శ్రీనివాస్‌, ముగ్గురు కుమార్తెలున్నారు. అంత్యక్రియల నిమిత్తం ఎంపీపీ సాయిలు రూ.10 వేల ఆర్థిక సాయం చేయగా పరిహారంగా రూ.50 వేలు ఇస్తామని చెప్పారు.

ఇదీ చూడండి:కష్టమేదైనా... అండగా శ్రీసీతారామ సేవాసదన్

ABOUT THE AUTHOR

...view details